డేటా వేగంలో సూపర్.. వన్‌ప్లస్6 - MicTv.in - Telugu News
mictv telugu

డేటా వేగంలో సూపర్.. వన్‌ప్లస్6

March 16, 2018

ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ సంస్థ వన్‌ప్లస్ త్వరలోన తన ప్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ఈ మోడల్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్‌లు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వన్‌ప్లస్‌ సంస్థ విడుదల చేసే తర్వాతి మోడల్‌ ‘వన్‌ప్లస్‌6‘ ఉంటుదని భావిస్తున్నారు. ఐఫోన్‌ ఎక్స్‌ తరహాలో బెజల్‌-లెస్‌-డిస్‌ప్లేతో విడుదల చేయబోతున్నారు.

ఈ ఫోన్‌లో కాట్ 16 ఎల్‌టీఈ సాంకేతిక  వినియోగించారని సమాచారం. ‘వన్‌ప్లస్‌ 5, ‘వన్‌ప్లస్‌ 5టీ’ మోడళ్లలో కాట్‌.12 ఉపయోగించారు. దీంతో డేటా ట్రాన్స్‌ఫర్‌ వేగం ఒక జిగాబైట్‌ వరకూ వస్తుందని తెలుస్తోంది. మరోవైపు ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 845ను వినియోగిస్తున్నారట. దీంతో ఇప్పటివరకూ విడుదలైన అన్ని వన్‌ప్లస్‌ ఫోన్ల కంటే ‘వన్‌ప్లస్‌ 6’లో డేటా వేగం అత్యధికంగా ఉండే అవకాశం ఉంది. కానీ ఈ మోడల్‌ 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్‌ చేసే అవకాశం లేదు.

ఎందుకంటే స్నాప్‌ డ్రాగన్‌ 845 చిప్‌సెట్‌ 5జీ కంపాటబులిటీ కాదు. ప్రస్తుతం స్నాప్‌డ్రాగన్‌ 855 చిప్‌సెట్‌లో 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్‌ చేసేలా ఎక్స్‌ 50 మోడెమ్‌ను రూపొందిస్తోంది. ఇది వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉంది.19:9 డిస్ ప్లేతో వస్తోన్న వన్‌ప్లస్‌ 6 ఆండ్రాయిడ్‌ ఓరియో వెర్షన్‌తో పనిచేస్తుంది.