మళ్లీ చుక్కలు చూపుతున్న ఉల్లి.. కిలో రూ. 80 - MicTv.in - Telugu News
mictv telugu

మళ్లీ చుక్కలు చూపుతున్న ఉల్లి.. కిలో రూ. 80

November 29, 2017

ఉల్లి ధర మళ్లీ  పెరిగింది. ఢిల్లీలో ఉల్లి కేజీ రిటైల్  ధర రూ. 80 పలుకుతోంది. సరఫరా తగ్గిపోవడం వల్లే ధరలు పెరిగాయని  వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. మెట్రో నగరాలను బట్టి ఉల్లి ధరలు రూ.50 నుంచి 70 వరకు ఉంది. ఆసియాలోనే అతి పెద్ద ఉల్లి మార్కెట్  అయిన మహారాష్ట్ర లాసల్‌గావ్ మండీకి ఉల్లి సరఫరా 47 శాతానికి పడిపోయింది.

గతేడాది ఇదే సమయంలో 22,933 క్వింటాళ్లు ఉండగా,ప్రస్తుతం 12వేల క్వింటాళ్లకు తగ్గింది. గతేడాది ఇదే సమయానికి  ఉల్లి ధర రూ. 7.50 పలుకగా, ప్రస్తుతం సగటున చూస్తే  రూ. 33 కిలో చొప్పున పలుకుతోందది. నేషనల్ హార్టికల్చర్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ నివేదిక ప్రకారం ప్రస్తుతం ఉల్లి రిటైల్ మార్కెట్‌లో ధర రూ. 50కి పైగా పలుకుతోంది.

ఉల్లి ఎక్కువగా పండించే  కర్ణాటక, మహారాష్ట్ర , మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి సరఫరా తగ్గింది.  దాంతో హోల్ సేల్, రిటైల్ ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు వాతావరణ పరిస్థితుల కారణంగా ఆయా రాష్ట్రాల్లో ఉల్లి ఉత్పత్తి  కూడా  బాగా తగ్గింది.