ఒప్పో ఎఫ్5 వచ్చేసింది.. - MicTv.in - Telugu News
mictv telugu

ఒప్పో ఎఫ్5 వచ్చేసింది..

November 2, 2017

చైనాకు చెందిన ఒప్పో కంపెనీ  కొత్త స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. గురువారం  ముంబైలో  జరిగిన కార్యక్రమంలో ఒప్పో ‘ఎఫ్ 5’ ను  విడుదల చేసింది. కెమెరాలో ఏఐ బ్యూటీ రికగ్నిషన్ ట్నెకాలజీతో వచ్చిన తొలి ఫోన్ ఇది. ఒప్పో ‘ఎఫ్ 5’ రెండు వేరియంట్లలో ఒకటి  4జీబీ ర్యామ్, 32 స్టోరేజ్ కాగా, మరొకటి 6 జీబీ ర్యామ్, 64 స్టోరేజ్‌లో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా,  రూ. 19,900, రూ. 24,900. 4జీబీ ర్యామ్ ఫోన్ బంగారం, తెలుపు రంగుల్లో , 6జీబీ ర్యామ్ ఫోన్ ఎరుపు, నలుపు రంగుల్లో లభించనున్నాయి. నవంబర్ 9న మెుదటి సేల్ ఉంటుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.

ఒప్పో ‘ఎఫ్5’ ఫీచర్లు..

6 అంగుళాల  ఫుల్ హెచ్ డిస్‌ప్లే.  2.5 కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే

2160×1080 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్

గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ 2.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్

4/6 ర్యామ్, 32/64జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్

16 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా,20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా

ఫింగర్ ఫ్రింట్ సెన్సర్ , 4జీ వీవోఎల్ టీఈ బ్లూటూత్ 4.2

3200 ఎంఏహెచ్ బ్యాటరీ.