mictv telugu

ఒప్పో ఆర్‌15 ప్రో… ఎక్స్‌చేంజ్ ఆఫర్‌తో పాటు

January 10, 2019

మొబైల్ తయారీ సంస్థల్లో ఒకటైన చైనా దిగ్గజ సంస్థ ఒప్పో కొత్త స్మార్ట్ ఫోన్‌ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. వినియోగదారులను ఆకట్టుకునే ఫీచర్లతో విడుదలైన ‘ఒప్పో ఆర్‌15 ప్రో’ స్మార్ట్‌ఫోన్ ధర రూ.25,990గా నిర్ణయించారు. దీనిలో భారీ డిస్‌ప్లేతో పాటు పవర్ ఫుల్ ర్యామ్‌ని అమర్చింది. అమెజాన్‌లో ఎక్స్‌క్లూసివ్‌గా లభించనున్న ఈ ఫోన్‌పై భారీ ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ఆఫర్‌ కూడా ఉంది. కస్టమర్లు తమ పాత స్మార్ట్‌ఫోన్‌ని మార్చుకుంటే దాదాపు రూ.8,938 వరకు డిస్కౌంట్‌ని పొందవచ్చు.Telugu News Oppo quietly launches the R15 Pro with a Snapdragon 660 and 6GB of RAM

ఫీచర్లు:

6.28″ ఫుల్ హెచ్‌డి ప్ల‌స్ ఓలెడ్ డిస్‌ప్లే ( 2280 × 1080 పిక్స‌ల్స్)

ఆక్టాకోర్ స్నాప్‌ డ్రాగ‌న్ 660 ప్రాసెస‌ర్‌

6 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌

ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం

16/20 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు

20 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా

ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌

3400 ఎంఏహెచ్ బ్యాట‌రీ

Telugu News Oppo quietly launches the R15 Pro with a Snapdragon 660 and 6GB of RAM