దేశభక్తి జడ్జీలకు ఉండొద్దా? - MicTv.in - Telugu News
mictv telugu

దేశభక్తి జడ్జీలకు ఉండొద్దా?

October 25, 2017

సినిమా హాళ్లలో జాతీయ గీతం వ్యవహారంపై సినీనటుడు అరవింద్ స్వామి తన ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ‘వినోదం కోసం సినిమా హాళ్ళలోనే జాతీయ గీతాన్ని ఎందుకు తప్పనిసరి చేశారు ? గవర్నమెంటు ఆఫీసులు, అసెంబ్లీ, కోర్టు, పార్లమెంటులో కూడా జాతీయ గీతాన్ని ఆలపించొచ్చు కదా… తనకు జాతీయ గీతమంటే గౌరవం వుంది.

నా ముందు ఎవరు ఆలపించినా వెంటనే నేను కూడా అందుకొని ఆలపిస్తా’ అని తన పోస్టులో పేర్కొన్నాడు. కేవలం దేశ పౌరులకే దేశభక్తి అవసరమా ? రాజకీయ నాయకులకు,  జడ్జీలకు, ప్రభుత్వాధికారులకు అవసరం లేదా ? అనే కోణంలో అరవింద్ స్వామి లేవనెత్తిన ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.