ప్రియా వారియర్ కన్ను కొట్టిన సీన్ కాపీనా? - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియా వారియర్ కన్ను కొట్టిన సీన్ కాపీనా?

February 21, 2018

ఈ మధ్య ఏ టీవీ ఛానల్, ఏ వార్తా పత్రిక,ఏ వెబ్‌సైట్ చూసినా  అన్నింటిలో కన్నుకొట్టిన పిల్ల ప్రియా వారియర్ గురించే. ‘ఒరు ఆదార్ లవ్’ టీజర్  విడుదలైన రాత్రి రాత్రే ప్రియ ఒక్కసారిగా సెలబ్రిటీ అయ్యింది.  కన్ను కొట్టి, గన్ను గురిపెట్టి  యూత్ గుండెలు కొల్లగొట్టింది ప్రియ.


అయితే ఆ సినిమాలోని  కన్ను కొట్టిన సీన్‌ను  ‘కిడు’ అనే మరో మలయాళ సినిమా నుంచి కాపీ కొట్టారా? ఏమో ‘కిడు’ సినిమా ట్రైలర్ చూస్తే  అందులో కూడా అచ్చం ప్రియా వారియర్ సీనే రిపీటయ్యింది. అయితే  ముందుగా ప్రియా ‘ఒరు ఆడార్ లవ్’ టీజర్ ముందుగా రిలీజ్ కావడంతో ఇప్పుడు అందరు  ఒరూ ఆదార్ లవ్‌ను కాపీ కొట్టిన ‘కిడు’ అని కామెంట్లు పెడుతున్నారు.

అయితే దీనిపై ‘కిడు’ నిర్మాత సబు పీకె..తన ఫేస్‌బుక్ పేజీలో రెండు వీడియోలను పోస్ట్ చేస్తూ.. మా సినిమా షూటింగ్ ఎడిటింగ్ ‘ఒరూ ఆదార్ లవ్’ సినిమాకంటే ముందే పూర్తి అయ్యింది.  కానీ ముందుగా  ప్రియా సినిమా టీజర్ రిలీజ్ కావడంతో అందరూ మా సినిమా కాపీ అని అంటున్నారు. దయచేసి నిజాలు గమనించగలరు అని పోస్ట్ చేశాడు. మరి ఈ సినిమాను ఆ సినిమా కాపీ కొట్టిందా? లేక ఆ సినిమాను ఈ సినిమా కాపీ కొట్టిందా అనే దానిపై  ప్రస్తుతానికి స్పష్టత లేదు.