ఆస్కార్ బరి నుంచి న్యూటన్ ఔట్… - MicTv.in - Telugu News
mictv telugu

ఆస్కార్ బరి నుంచి న్యూటన్ ఔట్…

December 15, 2017

2018 ఏడాదికి గాను అస్కార్ అవార్డుల నామినేషన్లలో ఉత్తమ విదేశీ చిత్రంగా కేటరిగి బరిలో నిలిచిన హిందీ మూవీ ‘న్యూటన్’ చిత్రానికి ఫైనల్‌లో మెండి చేయి ఎదురైంది. ఈ కేటగిరిలో పోటీ పడుతున్న తొమ్మిది  సినిమాల జాబితాలను ఆస్కార్ అవార్డుల కమిటీ తమ వెబ్‌సైట్‌లో ఉంచింది.

భారత్ నుంచి ఈ జాబితాలో రాజ్‌కుమార్‌రావు నటించిన ‘ న్యూటన్ ’ చిత్రానికి చోటు దక్కలేదు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల విధానం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి అమిత్ వి. మసుర్కార్ దర్శకత్వం వహించారు. అలాగే ఏంజెలీనా జోలీ నటించిన‘ ఫస్ట్ దే కిల్డ్ ఫాదర్ ’ సినిమా కూడా జాబితాలో చోటు దక్కలేదు.

ఆస్కార్ బరిలో ఉన్న చిత్రాలు

  1. ఎ ఫాంటాస్టిక్ ఉమెన్ (చిలీ)
  2. ఇన్ ద ఫేడ్ (జ‌ర్మ‌నీ)
  3. ఆన్ బాడీ అండ్ సోల్ (హంగేరీ)
  4. ఫాక్స్‌ట్రాట్ (ఇజ్రాయెల్‌)
  5. ది ఇన్‌స‌ల్ట్ (లెబ‌నాన్‌)
  6. ల‌వ్‌లెస్ (ర‌ష్యా)
  7. ఫెలిసిటే (సెనెగ‌ల్‌)
  8. ద వూండ్ (ద‌క్షిణాఫ్రికా)
  9. ద స్క్వేర్ (స్వీడ‌న్‌)

జనవరి 23న ఆస్కార్ అకాడమీ అవార్డుల నామినేషన్ల జాబితాను ప్రకటిస్తుంది.. మార్చి 4న లాస్ ఏంజెలిస్ లోని డాల్ఫీ థియేలర్‌లో అవార్డుల ప్రధాన వేడుకకు వేదికైంది.