ఆస్కార్ అవార్డుల వేడుకల్లో శ్రీదేవి.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆస్కార్ అవార్డుల వేడుకల్లో శ్రీదేవి..

March 5, 2018

90వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఈ రోజు లాస్‌ఏంజెల్స్‌లోని డాల్భీ థియేటర్‌లో కన్నుల పండగగా ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు వేడుకలు మొదలయ్యాయి. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటులు శశికపూర్‌, శ్రీదేవిలకు ఘనంగా నివాళులు అర్పించారు. ప్రముఖ అమెరికన్‌ సంగీత దర్శకుడు ఎడ్డీ వెడర్ సంగీత ప్రదర్శనతో వీరి సేవలను గుర్తు చేసుకున్నారు.2017 డిసెంబర్‌లో శశికపూర్‌ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. 2018 ఫిబ్రవరి 25న శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి కన్నుమూశారు. భారతీయ ప్రేక్షకుల కోసం వీరికి నివాళులు అర్పించేలా ఆస్కార్‌ ఏర్పాట్లు చేసింది.