ఉభయచర జీవికి.. ఆస్కార్ ఉత్తమ చిత్రం - MicTv.in - Telugu News
mictv telugu

ఉభయచర జీవికి.. ఆస్కార్ ఉత్తమ చిత్రం

March 5, 2018

ప్రపంచ ప్రఖ్యాతి‌గాంచిన ఆస్కార్ అవార్డుల ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ‘ ది షేప్ ఆఫ్ వాటర్’ చిత్రానికి ఏకంగా నాలుగు అవార్డులు లభించాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్ స్కోర్,  ఉత్తమ నిర్మాణ డిజైన్ విభాగాల్లో నాలుగు అవార్డులను ‘ది షేప్ ఆఫ్ వాటర్’ కైవసం చేసుకుంది. మనిషిని పోలిని ఒక ఉభయచర జీవిని ప్రయోగశాలలో బంధించడం, అక్కడి ఒక ఉద్యోగి దానితో ప్రేమలో పడ్డం, దాన్ని కాపాడ్డం ఈ చిత్ర కథ. పర్యావరణంపై చైతన్యాన్ని పెంచే చిత్రంగా మన్నన పొందింది.ఈ ఏడాదికి సంబంధించి ఆస్కార్ అవార్డుల విజేతల వివరాలు ఇలా ఉన్నాయి…

ఉత్తమ చిత్రం – ది షేప్‌ ఆఫ్‌ వాటర్‌

ఉత్తమ నటుడు – గ్యారీ ఓల్డ్ మ్యాన్ ( డార్కెస్ట్ హవర్ )

ఉత్తమ నటి – ఫ్రాన్సెస్ మెక్ డార్మాండ్ ( థ్రి బిల్‌బోర్డ్స్‌ ఔట్‌సైడ్‌ ఎబింగ్‌, మిసోరి )

ఉత్తమ డైరెక్టర్ – గుల్లెర్మో డెల్ టోరో (ది షేప్ ఆఫ్ వాటర్ )

ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్ – సామ్ రాక్ వెల్ ( థ్రి బిల్‌బోర్డ్స్‌ ఔట్‌సైడ్‌ ఎబింగ్‌, మిసోరి)

ఉత్తమ సపోర్టింగ్ యాక్ట్రెస్ – అల్లిసన్ జాన్నీ, ( ఐ, టోన్యా)

ఉత్తమ ఫారెన్ లాంగ్వేజ్ చిత్రం – ఏ ఫెంటాస్టిక్ ఉమెన్

ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ – కోకో

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ – రోజర్ ఎ. డీకిన్స్ ( బ్లేడ్ రన్నర్ 2049)

ఉత్తమ ఫిలిం ఎడింటిగ్ – డన్ కిర్క్

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ – ద షేప్ ఆఫ్ వాటర్

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ – మార్క్ బ్రిడ్జెస్ (ఫాంటమ్ త్రెడ్)

ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ – డార్కెస్ట్ హవర్

ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ – ఐకారస్

ఉత్తమ సౌండ్ ఎడిటింగ్ – డన్ కిర్క్

ఉత్తమ సౌండ్ మిక్సింగ్ – డన్ కిర్క్

ఉత్తమ లఘుచిత్రం (యానిమేటెడ్) – డియర్ బాస్కెట్‌బాల్

ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే – జేమ్స్ ఐవరీ (కాల్ మి బై యువర్ నేమ్)

ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే – జోర్డాన్ పీలే (గెట్ ఔట్)