రైల్వేకి బెస్ట్ సలహా ఇవ్వండి.. 10 లక్షలు గెల్చుకోండి! - MicTv.in - Telugu News
mictv telugu

రైల్వేకి బెస్ట్ సలహా ఇవ్వండి.. 10 లక్షలు గెల్చుకోండి!

March 28, 2018

ఎవరెవరికో ఉచిత సలహాలు పారేస్తుంటాం.. దమ్మిడి రాని సూచనలు చేస్తుంటాం.. కానీ ఇక్కడ మీ సలహాలకు మూల్యం చెల్లిస్తానంటోంది భారతీయ రైల్వేశాఖ. ’ రైలు ఆదాయం పెంచుకోవటానికి ఏం చేస్తే బాగుంటుంది ? మీ అమూల్యమైన సలహాకు మా విలువైన బహుమతిని అందుకోండి ’ అంటూ భారతీయ రైల్వే కోరుతోంది. రైల్వే అందిస్తున్న ప్రస్తుత సేవలకు భిన్నంగా ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనేదాని మీద రైల్వేశాఖ తర్జనభర్జనలు పడుతోంది. ఇందుకుగాను ప్రజలనుంచి తగు సలహాలు, సూచనలు కోరుతూ మంచి సలహా అందించిన వారికి రూ. 10 లక్షల బహుమతి ప్రకటించింది. ఉత్త పుణ్యానికి సలహాలు పారేసేవారికి ఇది సువర్ణ అవకాశమనే చెప్పొచ్చు.పనికొచ్చే సలహాలు ఇచ్చి తమను తాము నిరూపించుకోవాలని జెన్ భగీదరీ వెబ్‌సైట్ అధికారి ఒకరు పేర్కొన్నారు. పూర్తి వ్యాపార దృక్కోణంలోనే తమ సలహాలు వుండాలని కోరారు. వెయ్యి పదాల లోపు సలహా రాసి పంపాలని తెలిపారు.

అలాగే సలహాలకు నాలుగు కేటగిరీల్లో బహుమతులు ఇస్తున్నారు. అత్యుత్తమ సలహాకు రూ.10 లక్షలు ఇస్తే, రెండో ఉత్తమ సలహాకు రూ.5 లక్షలు, మూడవ ఉత్తమ సలహాకు రూ.3 లక్షలు, నాలుగో సలహాకు లక్ష రూపాయలు ఇస్తున్నట్టు రైల్వేశాఖ ప్రకటించింది.   https://innovate.mygov.in/jan-bhagidari/ వెబ్‌సైట్‌ ద్వారా మంచి సలహాలు ఇవ్వవచ్చని తెలిపింది. మే 19 లోపు మీ సలహాలను పంపాలని పేర్కొంది.