మోదీకి తగ్గలేదు.. అలోక్ వర్మ రాజీనామా

సీబీఐ వ్యహారంలో పంతాలు పట్టింపులు తారస్థాయికి చేరాయి. సీబీఐ చీఫ్ పదవి నుంచి మోదీ అలోక్ వర్మను తప్పించి, అగ్నిమాపక శాఖ డీజీగా నియమించడం తెలిసిందే. అయితే ఆ పదవి తనకొద్దంటూ వర్మ ఏకంగా ఐపీస్ సర్వీసుకే రాజీనామా చేశారు. తద్వారా తాను ఎవరికీ తలవంచేది లేదని స్పష్టం చేశారు. తన తొలగింపు విషయంలో సహజ న్యాయసూత్రాలకు విఘాతం కలిగిందని, ఆయన ఆరోపించారు.Telugu news Ousted from CBI, sent to put out fire, Alok Verma resigns from Indian Police Servicesఅగ్ని మాపక శాఖ డైరెక్టర్ జనరల్‌గా పదవిని వర్మ నిరాకరించారు. ఆయన ఈ నెల 31న పదవీ విరమణ చేయాల్సి ఉంది. సీబీఐ అంతర్గత వివాదానికి సుప్రీం కోర్టు చెక్ పెట్టి వర్మను తిరిగి సీబీఐ చీఫ్‌గా నియమించాలని కేంద్రాన్ని మంగళవారం ఆదేశించింది. దీంతో వర్మ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇది ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ప్రధాని నరేంద మోదీ నేతృత్వంలోని హైపవర్ కమిటీ నిన్న హడావుడిగా సమావేశమై వర్మను తప్పించింది.  వర్మ, సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్న నేపథ్యంలో కేంద్రం వారిని అక్టోబర్ నెలలో బలవంతపు సెలవుపై పంపడం తెలిసిందే.