mictv telugu

ముగ్గురిని బలితీసుకున్న ఔటర్.. అంబులెన్స్, కారు ఢీ

January 11, 2019

ఔటర్ రింగ్ రోడ్డు మరో ముగ్గురిని బలి తీసుకుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్ర ప్రమాదం అన్నా వినిపించుకోరు. డ్రైవర్ నిద్రమత్తు వల్ల ముగ్గురి ప్రాణాలు పోయాయి. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రావిరాల వద్ద ఔటర్‌ రింగ్‌రోడ్డుపై శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, అంబులెన్స్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారి పరిస్థితి విషమంగా వుందని వైద్యులు వెల్లడించారు.  Telugu news Outer ring road killing three members… Ambulance, car crashఏలూరు నుంచి రోగిని అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి అంబులెన్స్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్సులోని ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. కారు డ్రైవర్‌ నిద్ర మత్తే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.Telugu news Outer ring road killing three members… Ambulance, car crash