ఫ్లిప్‌కార్ట్‌లో 700 ఉద్యోగావకాశాలు - MicTv.in - Telugu News
mictv telugu

ఫ్లిప్‌కార్ట్‌లో 700 ఉద్యోగావకాశాలు

March 23, 2018

700కు పైగా ఉద్యోగ నియామకాలకు తెరతీసింది ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్. గడచిన రెండేళ్ళలో ఫ్లిప్‌కార్ట్ ఖర్చులను తగ్గించుకునే క్రమంలో భారీగా ఉద్యోగులపై వేటు వేసిన విషయం తెలిసిందే. దీంతో 2015 చివరి నాటికి 15 వేలుగా ఉన్న ఉద్యోగుల సంఖ్య 8వేలకు పడిపోయింది. మళ్ళీ ఉద్యోగులను భర్తీ చేసుకునే క్రమంలో ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగ నియామకాల ప్రకటన విడుదల చేసింది.డేటా సైన్స్‌ అండ్‌ ఎనలిటిక్స్‌ సహా కీలకమైన పలు విభాగాల్లో ఉద్యోగుల సంఖ‍్యను పెంచుకునేందుకు సిద్ధమైంది. హెచ్‌ఆర్‌ కన్సల్టెన్సీ సంస్థల తాజా నివేదికల ప్రకారం ఫ్లిప్‌కార్ట్‌ 700కు పైగా ఉద్యోగావకాశాలను కల్పించనుంది.