మామూలుగా ఎద్దులకు ఎరుపు రంగు అంటే పడదని విన్నాం. ఎరుపు బట్టలు వేసుకున్న వారిపై దాడి చేయడం చూశాం. కానీ గుజరాత్ లోని ఓ ఎద్దుకు మాత్రం పసుపు రంగు అంటే పడనట్టుంది. పసుపు రంగు కనపడగానే దాడి చేయడం మొదలు పెట్టింది.
మొదట బైక్ పై ఉన్న ఒకతనిపై దాడి చేసి ఆ తర్వాత రోడ్డుపై వెళుతున్న మరో పసుపు చీర కట్టుకున్న మరో మహిళపై ఒక్క సారిగా దాడి చేయడంతో ఆ మహిళ అమాంతం 10 అడుగుల ఎత్తు వరకూ ఎగిరి పడింది. స్థానికులు ఆ మహిళను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పక్కనే అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.