గుజరాత్‌లో ‘పద్మావతి’ బ్యాన్ - MicTv.in - Telugu News
mictv telugu

గుజరాత్‌లో ‘పద్మావతి’ బ్యాన్

November 22, 2017

విడుదల కాకముందే ‘పద్మావతి’ సినిమాకు ఎన్నెన్నో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు పద్మావతి పాత్రను పోషించిన దీపికా పదుకొనేను, దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీలను చంపేస్తామని బెదిరించారు.

వారి తలలకు నజరానాను కూడా ప్రకటించారు. చాలా చోట్ల అల్లర్లు జరుగుతున్నాయి.  అయితే తాజాగా గుజరాత్‌లో ‘పద్మావతి’ సినిమాను నిషేదిస్తున్నట్లు గుజరాత్ సియం విజయ్ రూపానీ ప్రకటించారు. గుజరాత్‌లో ఎన్నికలు జరగుతున్న నేపథ్యంలో  శాంతి భద్రతల దృష్ట్యా, ఈ నిర్ణయం తీసుకున్నట్లు  గుజరాత్ ప్రభుత్వం స్పష్టం చేసింది. మరి ఇంకో పదిరోజుల్లో విడుదల అవుతుందని  చెప్పిన ‘పద్మావతి’ సినిమా ఇంకెన్ని సంచలనాలకు దారి తీస్తుందో చూడాలి.