త్రీడీలో ‘పద్మావతి’ - MicTv.in - Telugu News
mictv telugu

త్రీడీలో ‘పద్మావతి’

October 26, 2017

దీపికా పదుకునే..రాణి పద్మినిగా హిందీలో తెరకెక్కుతున్న సినిమా ‘పద్మావతి’. ఈ ట్రైలర్‌కు అందరూ ఫిదా అవుతున్నారు. ట్రైలర్‌ను చూసి ప్యారామౌంట్ అనే హాలీవుడ్ సంస్థకూడా అవాక్కయ్యింది.  

అందుకే ‘పద్మావతి’ సినిమాను త్రీడీలో చూపించాలని ఆ సంస్థ భావిస్తోంది. ‘పద్మావతి’ సినిమా నిర్మాతలైన వయాకామ్ 18కు, ప్యారామౌంట్ సంస్థ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. డైరక్టర్ సంజయ్‌లీలా భన్సాలీ ఊహా వైభవాన్ని,  త్రీడీలో చూస్తేనే మజా ఉంటుందని ప్యారామౌంట్ సంస్థ వెల్లడించింది. డిసెంబర్ 1 న పద్మావతి  సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.