‘ పద్మావతి’ని మన దేశం పొమ్మంది..బ్రిటన్‌ రమ్మంది... - MicTv.in - Telugu News
mictv telugu

‘ పద్మావతి’ని మన దేశం పొమ్మంది..బ్రిటన్‌ రమ్మంది…

November 23, 2017

పద్మావతి సినిమా బ్రిటన్‌లో విడుదలకు సిద్దం అయింది. డిసెంబర్ 1న  విడుదల కానున్నట్లు బ్రిటీష్ బోర్డు ఆఫ్ ఫీల్మ్స్ క్లాసిఫికేషన్ (బీబీఎఫ్‌సీ) ప్రకటించింది. బుధవారం సెన్సార్  పూర్తి చేసుకున్న చిత్రం ఒక్క కట్ లేకుండా 12A సర్ఠిఫికెట్ పొందింది. ఈ  విషయాన్ని బీబీఎస్ తన అఫీషియల్ వైబ్‌సైట్‌లో పేర్కొంది.భారత్ లో రాజ్ పుత్ కర్ణి సేన నిరసనలు తెలుపుతూ,ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. మన దేశంలో వద్దంటున్న సినిమాకు బ్రిటన్‌లో అనుమతి రావడం కొత్త చర్చకు దారి తీసింది.సినిమాను సినిమాకు సినిమాలాగే చూడాలని,వివాదాలకు కేంద్రంగా చూడద్దని సినీ విశ్లేకులు అంటున్నారు.   మన దేశపు సెన్సార్ బోర్డు  పద్మావతికి అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన చిత్రంలో దీపిక పదుకునె, షాహిద్ కపూర్ , రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలలో నటించారు.