నాకు దీపిక తలకావాలి - MicTv.in - Telugu News
mictv telugu

నాకు దీపిక తలకావాలి

November 21, 2017

‘పద్మావతి’ సినిమాలో నటించి బీజేపీ, రాజ్‌పుత్ కర్ణిసేనల ఆగ్రహానికి గురైన దీపికా పదుకునేకు సీనియర్ నటుడు కమల్ హాసన్ గట్టి మద్దతు ప్రకటించాడు. ‘నాకు దీపిక తల కావాలి. దానిని భద్రంగా దాచుకుంటా. దీపిక శరీరాకృతి కంటే ఆమె శిరస్సునే ఎక్కువ గౌరవిస్తాను. దీపిక తలను కాపాడటమే నేను కోరుకునేది.ఆమె దేహం,స్వేచ్చ కంటే ఎక్కవగా తలనే గౌరవించాల్సిన అవసరం ఉంది.ఒకప్పుడు చాలా సంఘాలు నా సినిమాలను కూడా వ్యతిరేకించాయి.ఇక భరించింది చాలు. ప్రజలారా మేలుకోండి… ఇది ఆలోచించాల్సిన  తరుణం. ఆమెను రక్షించుకుందాం’ అంటూ ఆయన  ట్వీట్ చేశారు. దీపిక తలపై బీజేపీ, కర్ణిసేనలు వెలకట్టిన నేపథ్యంలో ఆయన స్పందించారు. త్వరలో రాజకీయ ప్రవేశం చేయడానికి సిద్దమవుతున్న  కమల్ ప్రతి రోజు ఇలా ఏదో ఒక అంశంపై స్పందిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ సర్కారును టార్గెట్ చేసుకున్నారు.