పేస్ అరుదైన రికార్డ్.. 44 ఏళ్లు.. 43 గెలుపులు - MicTv.in - Telugu News
mictv telugu

పేస్ అరుదైన రికార్డ్.. 44 ఏళ్లు.. 43 గెలుపులు

April 7, 2018

లియాండర్ పేస్ మరో అరుదైన రికార్డును నెలకొల్పాడు. డేవిస్ కప్‌ టోర్నీ డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్నతో జోడీ కట్టి విజయ దుందుభి మోగించాడు.  చైనా జంట జీ జాంగ్, జిన్ గాంగ్‌పై 5-7,7-6(5), 7-6(3)తో విజయం సాధించారు. వెటరన్ ఆటగాడిగా భారత టెన్నిస్‌కు దిగ్గజంగా నిలబడ్డాడు 44 ఏళ్ల పేస్. ఇరాన్‌ ఆటగాడు నికోలా పిట్రాంగిలీ డేవిస్‌లో అత్యధిక డబుల్స్‌ విజయాల( 42) రికార్డును పేస్‌ తిరగరాశారు. 43 విజయాలతో ఎవరికీ సాధ్యం కాని రికార్డు నెలకొల్పాడు.గత ఏప్రిల్‌లో ఉజ్బెకిస్తాన్‌తో జరిగిన డేవిస్‌ కప్‌ ఆసియా ఓసియానియా గ్రూప్‌–1 పోరుకు పేస్‌ను పక్కన పెట్టారు. ఈసారి డేవిస్‌ కప్‌లో పేస్‌ పాల్గొంటాడా లేదా అనే అనుమానాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఎవరూ ఊహంచని విధంగా అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఏఐటీఏ) డేవిస్‌కప్‌ పోరుకు పేస్‌ను ఎంపిక చేసింది. దీంతో పేస్‌కు మరోమారు కాలు దువ్వటానికి అవకాశం దొరికినట్టైంది. పేస్‌ డేవిస్‌ ఆటలో తొలుత నుంచీ విజాయాలనే ఎక్కువగా చవిచూశాడు.  1990లో డేవిస్‌ కప్‌లో జీసన్‌ అలీతో తొలిసారి జతకట్టిన పేస్‌ ఇప్పటివరకు 12మంది భాగస్వాములతో ఈ ఘనత సాధించారు. ఎక్కువగా మహేశ్‌ భూపతితో కలిసి 25 విజయాలు అందుకున్నారు.