ఆరు పసిమొగ్గలను చిదిమేశాడు.. వీడికి మరణశిక్ష సరిపోతుందా? - MicTv.in - Telugu News
mictv telugu

ఆరు పసిమొగ్గలను చిదిమేశాడు.. వీడికి మరణశిక్ష సరిపోతుందా?

February 17, 2018

జనవరి 4వ తేదీన  పాకిస్థాన్ లాహోర్ నగరంలో నిలువెల్లా కామం నిండిన పశువుకొట్టి  ఏడేళ్ల బాలికను కిడ్నాప్ చేసింది. అనంతరం ఆ చిన్నారిపై  పలుమార్లు పైశాచికంగా, క్రూరాతి క్రూరంగా లైంగిక దాడి చేసి  ఆ తర్వాత చంపి, మృతదేహాన్ని  చెత్త కుప్పలో పడేసింది.

 ఈ ఘటన పాకిస్థాన్ ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. అభం,శుభం తెలియని చిన్నారిపై ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ఆ రాక్షసున్ని ఊరికే వదిలిపెట్టద్దు అంటూ  ప్రజలు  ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. దీనితో అక్కడి ప్రభుత్వం  ఈ కేసును సీరియస్ గా తీసుకుంది. అతన్ని అరెస్ట్ చేసి మరణశిక్షను విధించింది. రూ.32 లక్షల జరిమానాను కూడా వేసింది.

అయితే నిందితుడిని విచారిస్తున్న సమయంలో అతను చేసిన మరిన్ని దారుణాలు కూడా బయటపడ్డాయి. ఇంతకు ముందు ఇలాగే  ఐదుగురు మైనర్ బాలికలను  లైంగికంగా వేధించి  చంపేశాడు. మరి ఇలాంటి  మానవ మృగానికి  మరణశిక్ష  సరిపోతుందా? మళ్లీ ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా  ఎవ్వరూ మర్చిపోలేని శిక్షను విధించాలి అని  అక్కడి ప్రజలు భావిస్తున్నారు.