అమ్మాయిలతో మాట్లాడితే జరిమానా, ఫోన్ల ధ్వంసం - MicTv.in - Telugu News
mictv telugu

అమ్మాయిలతో మాట్లాడితే జరిమానా, ఫోన్ల ధ్వంసం

February 7, 2018

ఇస్లామిక్ దేశాల్లో చట్టాలు కఠినంగా ఉన్నాయన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహిళల స్వేచ్చకు అడ్డుకట్ట వేసేలా వీటిని రూపొందిస్తుంటాయి. అయితే క్రమశిక్షణ పేరుతో పురుషులనూ శిక్షించే ఉదంతాలు పెరిగిపోతున్నాయి. ఓ అబ్బాయి.. అమ్మాయిలతో మాట్లాడినందుకు పాకిస్తాన్ లోని ఒక కాలేజీ యాజమాన్యం అతనికి రూ. 2 వేల జరిమానా విధించింది.లాహోర్ ఎం ఇస్లాం మెడికల్  అండ్ డెంటల్ కాలేజీలో గత డిసెంబర్ నెలలో ఈ ఘటన జరిగింది. ఎంబీబీఎస్ మొదటి ఏడాది చదువుతున్న అబ్బాయి తరగతి బయట ఇద్దరు అమ్మాయిలతో నిలబడి చిట్ చాట్ చేశాడు. ఇది చూసిన కాలేజీ సిబ్బంది పై అధికారులకు ఫిర్యాదు చేశారు.  తరగతి బయట మాట్లాడం మంచి ప్రవర్తన కాదంటూ సదరు విద్యార్థికి 2000 రూపాయల జరిమానాను విధించారు.  

జరిమానా రసీదు ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నగరంలోని మరో మెడికల్  కాలేజీలోనూ ఇలాంటి ఘటనలు జరిగినట్లు తెలుస్తోంద. అమ్మాయిలతో మాట్లాడినందుక అబ్బాయిల ఫోన్లను లాక్కుని రాళ్లతో పగలగొడుతున్న వీడియో ఒకట్ వైరల్ అయింది.