‘పాకిస్తానీ’ అంటే మూడేళ్ల జైలుశిక్ష వేయాలి - MicTv.in - Telugu News
mictv telugu

‘పాకిస్తానీ’ అంటే మూడేళ్ల జైలుశిక్ష వేయాలి

February 7, 2018

ముస్లింలు పాకిస్తాన్ వెళ్లిపోవాలి కొన్ని  హిందూ సంస్థలు అంటుడడం తెలిసిందే. దీనిపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత  అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ అయ్యాడు. ‘భారతీయ ముస్లింలను ఎవరైనా పాకిస్తానీలు అని అంటే వారికి మూడేళ్ళ జైలుశిక్ష విధించేలా చట్టం తీసుకురావాలి ’ అని లోక్‌సభలో డిమాండ్ చేశారు. బరేలీ జిల్లాలో హిందూ యువకులు  ముస్లిమ్ నివాస ప్రాంతాల్లో పర్యటించి పాకిస్తాన్‌కు  వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఘటనపై ఆయన స్పందించారు. .

స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు అవుతున్నా ఇంకా భారతీయ ముస్లింలను పాకిస్తానీలుగా చూడడం సరికాదు.. ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాల్లోకి ప్రవేశించి పాక్  వ్యతిరేక నినాదాలు చేయడం పరిపాటిగా మారింది.. యూపీలోని కాస్‌గంజ్ పట్టణంలో ఓ వ్యక్తి పెట్టిన ఫేస్‌బుక్ పోస్టుల వల్లే మత కలహాలు ఎక్కువయ్యాయి. భారతలో నివసించే ముస్లింలు మహమ్మద్ అలీ జిన్నా ప్రతిపాదించిన ద్విజాతి సిద్ధాంతాన్ని వ్యతిరేకించారు’ అని ఒవైసీ అన్నారు.ఇదిలా వుండగా బీజేపీ ఎంపీ వినయ్ కతియార్ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో ‘అయోధ్య- రామేశ్వరం ఎక్స్‌ప్రెస్ ‘ రైలు ప్రారంభోత్సవంay వినయ్ కతియార్ మాట్లాడుతూ  ‘ ముస్లింలకు ఈ దేశంలో నివసించే హక్కు లేదు. వాళ్లంతా బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లకు వెళ్లిపోవాలి. వందేమాతరాన్ని గౌరవించనివాళ్లను, పాకిస్తాన్ జెండాను ఎగరేసే వాళ్లను, జాతీయ పతాకాన్ని అవమానించేవాళ్లను శిక్షించడానికి ఓ చట్టం తీసుకురావాలి ’ అని డిమాండ్ చేశారు.