వారానికి ఎన్ని పాన్‌కార్డ్ దరఖాస్తులో తెలుసా? - MicTv.in - Telugu News
mictv telugu

వారానికి ఎన్ని పాన్‌కార్డ్ దరఖాస్తులో తెలుసా?

February 7, 2018

గతంలో పాన్‌కార్డ్ కోసం ఎవరూ అంతగా  ఆసక్తి చూపెట్టకపోయినా ఇప్పుడు మాత్రం చాలామంది దాని కోసం ఆరాటపడుతున్నారు. వారానికి  దాదాపు 15-25 లక్షల మంది  పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నట్టు  ఆదాయ పన్ను శాఖ  వెల్లడించింది.  ఈ ఏడాాది జనవరి 28వ తేదీ నాటికే దాదాపు 20.7 లక్షల  అప్లికేషన్లు వచ్చాయి.  వాటిని సంబంధిత  అధికారులు పరిశీలించే పనిలో ఉన్నారని.. ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా  లోక్‌సభలో చెప్పారు.పాన్ కార్డులను జారీ చేసేందుకు  గంటల వ్యవధి నుంచి  రెండు వారాల వరకు పడుతోందని ఐటీ శాఖ వివరించింది. ఎన్ఎస్‌డీఎల్ ఈ-జీవోవీ, యూటీఐటీటీఎస్ఎల్ ద్వారా ఐటీ విభాగం తీసుకుని పాన్ దరఖాస్తులను  ప్రాసెస్ చేసి డేటాను డిజిటలైజ్ చేస్తుంది. ఆ తర్వాత  ఆ వివరాలను ఐటీడీకి  పంపి  అక్కడ  ఆఖరిగా పరిశీలించి  దరఖాస్తు చేసుకున్న వారికి వారి పాన్‌0కార్డ్‌ను జారీ చేస్తారు.