పంజాబ్ ప్రభుత్వం బాలికల ప్రభుత్వ పాఠశాలల్లో 50 సంవత్సరాలు లోపు మగ ఉపాధ్యాయులను నియమించకూడదని ఉపాధ్యాయులు బదిలీ విధానంలో ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు సంబంధించిన వివరాలను పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో పెట్టింది. దానిపై 15 రోజుల్లో అభిప్రాయాలను తెలియజేయాలని ప్రజలను కోరింది. ఉపాధ్యాయులు ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. ప్రభుత్వ ప్రతిపాదనకు తాము వ్యతిరేకిస్తున్నట్టు ప్రభుత్వ ఉపాధ్యాయుల యూనియన్ ప్రెసిడెంట్ సుఖ్వీందర్ చాహల్ పేర్కొన్నారు. విద్యార్థులకు పాఠాలు చెప్పే గురువు వ్యక్తిత్వాన్ని ప్రశ్నించడం తప్పుగా వారు అభిప్రాయ పడ్డారు. విద్యా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, మానవ వనరులను సరైన రీతిలో ఉపయోగించడం ,ఉద్యోగుల్లో బాధ్యతల పట్ల సంతృప్తిని తీసుకొచ్చేందుకే ఈ ప్రతిపాదనను చేసినట్టు ప్రభుత్వం తెలిపింది.