‘శ్రవణ కుమారుడి’ న్యాయపోరాటం.. - MicTv.in - Telugu News
mictv telugu

‘శ్రవణ కుమారుడి’ న్యాయపోరాటం..

September 1, 2017

శ్రవణ కుమారుడు ముసలి తల్లిదండ్రులను కావడిలో మోసుకు తిప్పుతూ పుణ్యతీర్థాలు చూపించాడని రామాణంలో చదువుకున్నాం. కానీ ఒడిశాకు చెందిన అభినవ శ్రవణ కుమారుడు మాత్రం తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి తల్లిదండ్రులను కావడిలో మోసుకెళ్లాడు.. ఏకంగా 40 కిలోమీటర్లు వారి మోసుకుంటూ కోర్టు గడప తొక్కడు.

మయూర్ భంజ్ జిల్లా మోరదా గ్రామానికి చెందిన కార్తీక్ సింగ్ పై 8 ఏళ్ల కిందట బూటకపు కేసు నమోదైంది. పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. దీంతో అతణ్ని గ్రామస్తులు సాంఘికంగా బహిష్కరించారు. పనివ్వలేదు. కనిపిస్తే దూరంగా వెళ్లిపోయేవారు. చివరికి పెళ్లి సంబంధాలు కూడా రాలేదు. దీంతో జీవనం కష్టంగా మారిపోయింది. తాను నిర్దోషినని జిల్లా కలెక్టర్కు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. తనకు జరిగిన అన్యాయంపై న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడు కార్తీక్. తల్లిదండ్రులను కావడిలో కూర్చోబెట్టుకుని కావడిని భుజాన మోసుకుంటూ 40 కిలోమీటర్లు నడిచి కోర్టుకు చేరుకున్నుడు. తల్లిదండ్రులు మరణించేలోగా తాను నిర్దోషినని తేలితే వారి సంతోషం చూడాలని ఉందని చెప్పాడు.