ఏది గుడ్ టచ్? ఏది బ్యాడ్ టచ్? పిల్లలకు ఈ వీడియో తప్పకుండా చూపండి! - MicTv.in - Telugu News
mictv telugu

ఏది గుడ్ టచ్? ఏది బ్యాడ్ టచ్? పిల్లలకు ఈ వీడియో తప్పకుండా చూపండి!

February 14, 2018

లైంగిక దాడులకు అంతే లేకుండా పోయింది. అభం శుశం తెలియని పసిపిల్లల నుంచి, పండు ముసలి వరకు ఎవర్నీ వదలకుండా లైంగిక దాడులకు పాల్పడుతున్నారు మృగాళ్ళు. చెట్టుకు చీర చుట్టినా కామంతో అత్యాచారానికి ఒడిగట్టే విధంగా తయారవుతున్నారు. ఈ నేపథ్యంలో బాలికలను, మహిళలను జాగృతం చేయాల్సిన అవసరం ఎంతో వుంది. ముఖ్యంగా పసి పిల్లల విషయంలో వారితోపాటు  తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు పాటించాలి. దీని గురించి పిల్లలకు చక్కగా వివరించే వీడియో ఇది..

గుడ్‌టచ్, బ్యాడ్‌టచ్ వంటి రెండు అంశాలను ఈ వీడియోలో చూపించారు. టీచరమ్మ ఒక బొమ్మతో ఈ ప్రయోగం చేసి ఆ పిల్లల్లో మంచి అవగాహనను నింపింది. పెదాలు, ఛాతీ, జననావయవాల దగ్గర, నడుము దగ్గర ఎవరైనా తాకితే అది అసభ్యకరం అని చెబుతుంది. అలా ఎవరైనా తాకితే ‘నో.. డోంట్ టచ్ మీ ’ అని అరవాలంటుంది. అక్కడ కేవలం తల్లదండ్రులు, అమ్మమ్మలు, తాతయ్యలు మాత్రమే టచ్ చేస్తారని వివరించింది.

అలాగే గుడ్‌టచ్‌ల గురించి కూడా పసివాళ్ళకు అర్థమయ్యేలా చాలా కూలంకుషంగా వివరించింది. తల భాగం నిమిరినా, చెంపల్ని తాకినా, షేక్‌హ్యాండ్ ఇచ్చినా అవి గుడ్‌టచ్‌లు అన్నది. జంతువులు సైతం ఎవరైనా తాకితే తమ ఆత్మ రక్షణ కోసం పరుగులు తీస్తాయి కదా.. అలాగే ఆడపిల్లలు కూడా చాలా జాగ్రత్తగా వుండాల్సిన అవసరం చాలా వుంది. పిల్లల ద్వారా చాలా చక్కగా చెప్పించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.