అయ్యప్ప భక్తుల ధర్నా.. తృప్తి ఓ తాటకి - MicTv.in - Telugu News
mictv telugu

అయ్యప్ప భక్తుల ధర్నా.. తృప్తి ఓ తాటకి

November 20, 2018

శబరిమల అయ్యప్ప స్వామి గుడిలో తరతరాల నుంచి పాటిస్తున్న సంప్రదాయాలకు భంగం కలిగించే చర్యలను సహించబోమని అయ్యప్ప భక్తులు హెచ్చరించారు. కేరళలో అరెస్ట్ చేసిన భక్తులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో శబరిమల సంరక్షణ సమితి  ఆధ్వరంలో ఈ రోజు ధర్నా నిర్వహించారు. కాకినాడ శ్రీపీఠం అధిపతి, బీజేపీ నేత స్వామి పరిపూర్ణానంద తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Telugu news Paripoornananda swamy blames supreme court verdict on women entry into Sabarimala ayyappa temple and described Trupti Desai as Thataki

పరిపూర్ణ మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక విషయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడం సరికాదని ఆక్షేపించారు. అన్ని వయసుల మహిళలను అయ్యప్ప గుడిలోకి అనుమతించాలన్న సుప్రీం కోర్టు తీర్పును తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ‘శబరిమలను  కాపాడుకోవడానికి ఆత్మహత్యకైనా సిద్ధం.. శరణం లేకపోతే మరణం.. రెండే మా ముందున్నాయి. కేరళ పోలీసులు అయ్యప్ప భక్తులపై అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. అయ్యప్ప స్వామితో సమానమైన ఇరుముడి ఎత్తుకున్న భక్తులపై దాడి చేస్తున్నారు… ’ అని మండిపడ్డారు. ఆరునూరైనా సరే అయ్యప్పను దర్శించుకుంటానన్న భూమాత బ్రిగేడ్ నాయకురాలు తృప్తి దేశాయ్‌పై పరిపూర్ణానంద తీవ్ర విమర్శలు చేశారు. ‘ఆమో ఓ తాటకి. మహిళలు తాము శబరిమల గుడిలోకి వెళ్లం అంటున్నారు. కానీ  సుప్రీంకోర్టు మాత్రం వెళ్ళండి అని చెప్తోంది..’ అని విమర్శించారు.

Telugu news Paripoornananda swamy blames supreme court verdict on women entry into Sabarimala ayyappa temple and described Trupti Desai as Thataki