మానవుడే మహనీయుడు. సూర్యుడికి అత్యంత చేరువగా పార్కర్

అంతరిక్ష రంగంలో అద్భుతం ఆవిష్కృతమైంది. మానవుడు నిర్మించిన ఒక వస్తువు సూర్యభగవానుడికి అత్యంత చేరువగా ప్రయాణించింది. ఆదిత్యుడి పుట్టుక, ఇతర రహస్యాలను చేధించే లక్ష్యంతో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) పంపిన పార్కర్ సోలార్ ప్రోబ్ వ్యోమనౌక సూర్యుడికి అతి చేరువగా వెళ్లింది. స్తువు ఇదే.

trtrt

78 రోజుల క్రితం భూమి నుంచి వెళ్లిన పార్కర్‌ సోలార్‌ సూర్యుడికి 26.55 మిలియన్‌ మైళ్ల దూరం వరకూ వెళ్లింది.  సూర్యుడికి 3.83 మిలియన్‌ మైళ్ల దూరంలోని గమ్యానికి వెళ్లడం దీని లక్ష్యమని నాసా ప్రాజెక్టు మేనేజర్‌ ఆండీ డ్రైస్‌మాన్‌ తెలిపారు. 2024 నాటికి ఇది గమ్యస్థానం చేరుకుంటుందన్నారు. ‘పార్కర్ లోకబాంధవుడికి చేరుగా వెళ్లే సమయంలో చాలా సమస్యలు ఎదురవుతాయి. భరించరాని ఉష్ణోగ్రత, రేడియేషన్‌ ఎదుర్కోవాల్సి వస్తుంది.. అయినా పార్కర్ అన్నీ తట్టుకుంటుందని భావిస్తున్నాం..’ అని వెల్లడించారు. కాగా సూర్యుడికి దగ్గరగా వెళ్లిన రికార్డు  ఇప్పటివరకు 1976లో అమెరికా, జర్మనీల హిలియోస్‌-2 వ్యోమనౌక పేరుపై ఉంది.

Parker Solar Probe now closest ever spacecraft to the sun