బతుకమ్మ పాటలతో మనలను అలరించిన వర్థమాన సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి తండ్రి విద్యుదాఘాతంతో చనిపోయారు. ఈ ఘటనతో వారి కుటుంబంలో తీరని శోకం మిగిలింది. మహబూబా బాద్ జిల్లా మానుకోటకు చెందిన చంద్రయ్య బొబ్బిలి నిన్న పొలంలో విద్యుత్ షాక్తో మరణించారు. చంద్రయ్య చిందు యక్షగానం కళాకారుడిగా, జానపద గాయకుడిగా చాలా ప్రదర్శనలిచ్చి మంచి పేరు సంపాదించుకున్నారు.బతుకమ్మ పాటలే గాకుండా ‘ మైక్ టీవీ ’లో మేడారం, సంక్రాంతి, తెలంగాణ విమోచన దినోత్వవానికి సంబంధించిన పాటలను అందించి సంగీత ప్రియులను ఆకట్టుకున్నాడు సురేష్ బొబ్బిలి. సినిమాలకు సైతం సంగీతం అందిస్తున్నాడు సరేష్. ‘ అప్పట్లో ఒకడుండేవాడు ’ సినిమాకు సురేష్ సంగీత దర్శకుడని తెలిసిన విషయమే.
త్వరలో రాబోతున్న ‘ నీదీ నాదీ ఒకే కథ ’ ‘ గువ్వా గోరింక ’ సినిమాలకు సంగీతం అందించాడు. కాగా సురేష్ తన చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్నాడు. తండ్రే తన ప్రపంచం అనుకున్నాడు కానీ తండ్రి కూడా అకాల మరణంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయినట్టైంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే చంద్రయ్య మరణించాడని ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.