రోడ్ల మీద పెంపుడు కుక్కలు పాస్ పోస్తే రూ. 500 జరిమాన - MicTv.in - Telugu News
mictv telugu

రోడ్ల మీద పెంపుడు కుక్కలు పాస్ పోస్తే రూ. 500 జరిమాన

March 24, 2018

రూల్స్ మనుషులకే కాదు కుక్కలకు కూడా అంటోంది ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్. అవి రోడ్డు పైన మలమూత్రాలు విసర్జిస్తే వాటి యజమానులకు రూ. 500 జరిమాన విధించనున్నారు. కుక్కలను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న యజమానులు వాటిని ఉదయం, సాయంత్రాలు బయటకు వాకింగ్‌కు తీసుకెళ్ళి అవి పార్కులు, ఫుత్‌పాత్‌లు, రోడ్లపైనే మల,మూత్రాలు విసర్జించేలా చేస్తున్నారు.

దీంతో రోడ్లు అపరిశుభ్రంగా మారుతున్నాయని దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ ఛైర్మన్ ఆందోళన వ్యక్తం చేసారు. దీనితో వాటి యజమానుల నుంచి రూ.500 ల చొప్పున జరిమానా విధించేలా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు.