పటాన్‌చెరు రబ్బర్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం - MicTv.in - Telugu News
mictv telugu

పటాన్‌చెరు రబ్బర్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

April 24, 2018

పటాన్‌చెరు పారిశ్రామికవాడలో  ఈ రోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక అగర్వాల్ రబ్బర్  పరిశ్రమలో షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడి, కిలోమీటర్ల మేర దట్టమైన పొగలు వ్యాపించాయి. పేలుడు ధాటికి పెద్ద శబ్దాలు రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది  వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని,5 అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను ఆర్పే ప్రయత్నాలు చేశారు. అయితే బలమైన ఈదురు గాలులు వీస్తుండటంతో మంటలను అదుపు చేయడానికి సిబ్బంది తీవ్రంగా కష్టపడి మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు భావిస్తున్నారు. మూడు నెలల  కిందట ఇదే గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదాన్ని తట్టుకోలేక కంపెనీ చైర్మన్‌ గుండెపోటుతో మరణించాడు.