కరెంటును పుట్టిచ్చే పనిలో రాందేవ్ బాబా - MicTv.in - Telugu News
mictv telugu

కరెంటును పుట్టిచ్చే పనిలో రాందేవ్ బాబా

December 5, 2017

సబ్బులు , పేస్టులు, నూడుల్స్ ఇట్లా వినియోగదారులకు ఇంట్లకు కావాలసిన అన్ని వస్తువులను అందించిన పతాంజలి, ఇప్పుడు ఇంకో బిజినెస్ అడుగుపెట్టబోతోంది. త్వరలో కరంటును పుట్టిచ్చే సోలార్ విద్యుత్ పరికరాలను తయారు చేయనున్నట్లు పతాంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణ తెలిపారు.

‘సోలార్ విద్యుత్ పరికరాలను తయారుచేయడం ద్వారా దేశంలో ప్రతి ఇంటిలో వెలుగులు నింపే అవ‌కాశం క‌లుగుతుంది. ఆ క‌ల‌ను సాకారం చేసేందుకు మేం కృషి చేస్తాం’ అని ఆయన అన్నారు. రూ .100 కోట్ల పెట్టుబడితో  గ్రేటర్ నోయిడాలో సోలార్ విద్యుత్ కర్మాగారాన్ని  ఏర్పాటు చేయనున్నారు. ఇంకో రెండు నెలల్లో  సోలార్ విద్యుత్ పరికరాల తయారీ మొదలవుతుందని పతాంజలి నిర్వాహకులు తెలిపారు.