ఈటీవీ పటాస్‌కు పైరవీ కారుల గండం..హెడ్డింగ్ అర్థం కావాలంటే చదవండి - MicTv.in - Telugu News
mictv telugu

ఈటీవీ పటాస్‌కు పైరవీ కారుల గండం..హెడ్డింగ్ అర్థం కావాలంటే చదవండి

November 24, 2017

ఈటీవీ ప్లస్‌లో ప్రసారమయ్యే  ‘పటాస్ షో’ లో ప్రేక్షకులుగా వెళ్లాలంటే  పైసలు ఇవ్వాలా? మల్లెమలా ప్రొడక్షన్లో వస్తున్న ‘పటాస్ షో’కు  చాలా మంది కాలేజీ విద్యార్థులు  కనిపిస్తుంటారు. మరి వారందరికి ఎంట్రీ ఫ్రీగా ఇస్తున్నారా ? అంటే అవునే ఎంట్రీ ఉచితమే. కానీ కొందరు మాయగాళ్లు  అమాయక విద్యార్థులను ఆసరాగా చేసుకుని ‘మిమ్మల్ని పటాస్ షోలోకి  పంపిస్తాం అని  పైసలు వసూల్ చేస్తున్నారట.ఈ విషయంపై ఆ షో యాంకర్స్  రవి,శ్రీముఖి  ఫేస్ బుక్ లో ఓ వీడియో పెట్టారు.  పటాస్ షోకు పంపిస్తాం అనే పైరవీ గాళ్లను నమ్మకండి అని ఆ వీడియోలో జనాల్ని అప్రమత్తం చేశారు.