యూజర్ల డేటాను చైనాకు ఇస్తున్న పేటీఎం! - MicTv.in - Telugu News
mictv telugu

యూజర్ల డేటాను చైనాకు ఇస్తున్న పేటీఎం!

March 29, 2018

చైనా భారతీయులను నట్టేట ముంచటానికి పూనుకున్నట్టే తెలుస్తోంది. పేటీఎంతో ఆధార్ లింక్ చేయాలని నీతులు చెప్తూనే భారతీయుల వెనకాల గోతులు తవ్వుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆధార్‌తో లింక్ చేసుకుంటే రూ.200 క్యాష్ బ్యాక్ కూడా ఇస్తూ ఎంచక్కా చాలా మందిని మభ్య పెడుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. పేటీయం తన వినియోగదారుల వివరాలను చైనా సంస్థలతో పంచుకుంటోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేటీయంకు వన్97 అనేది మాతృసంస్థ. ఈ సంస్థకు మరికొన్ని విదేశీ సంస్థలతో సంబంధాలు వున్నాయి. అవి చైనా సంస్థలనే బలమైన వాదనలు వినపడుతున్నాయి. పేటీఎంకు సంబంధించిన వివరాలన్నీ వన్97 లో నిక్షిప్తం అయి వుంటాయి. ఆర్బీఐ రూల్స్ ప్రకారం బ్యాంకులు తమ వినియోగదారుల వివరాలను దేశం దాటించకూడదు. కానీ పేటీఎం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందంటున్నారు నిపుణులు.ఆధార్ లింక్ ఇస్తే డబ్బు ఎదిరివ్వడం ఏంటనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే దీనిపై ఇంకా పేటీఎం వర్గాలు స్పందించకపోవటం గమనార్హం. మరో అబ్బురపరిచే విషయం ఏంటంటే.. చైనాకు చెందిన అతిపెద్ద సంస్థ అలీబాబా కంపెనీకి పేటీయంలో 40శాతం వాటాలున్నాయనే విషయం అందరికీ తెలిసిందే. దీన్నిబట్టి పేటీఎం వినియోగదారుల వివిరాలు అలీబాబా కంపెనీతో పంచుకుంటున్నదన్నది వాస్తవం అని తెలుస్తోంది.