మరో ఖాతా తెరిచిన పవన్ - MicTv.in - Telugu News
mictv telugu

మరో ఖాతా తెరిచిన పవన్

November 27, 2017

పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ మరో ట్విటర్ ఖాతాను  ప్రారంభించాడు.  @Pkcreactiveworks పేరుతో అకౌంట్‌ను ఓపెన్ చేశాడు. . ‘నాకు ప్రేమను, శక్తిని  ఇచ్చిన సినీ రంగానికి  గౌరవాన్ని ,ప్రేమను ఇవ్వాలనుకుంటున్నా. సమాజానికి మెరుగైన సేవ చేయడానికే ఈ రంగాన్ని ఉపయోగించుకుంటాను. ఈ అకౌంట్ పూర్తిగా సినిమాల కోసమే ’ అని ట్వీట్  చేశాడు.

 పవన్‌కు ఇప్పటికే   అధికార  ట్విటర్ అకౌంట్  ఉంది. దాని ద్వారా తన మనోభావాలను, అభిప్రాయాలను ప్రజలకు, అభిమానులకు తెలియజేస్తూ ఉంటారు. పవన్ ప్రస్తుతం తివిక్రమ్ దర్శకత్వంలో తన 25 వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో పవన్‌కు జోడిగా కీర్తీ సురేశ్ , అను  ఇమాన్యుయేల్ నటిస్తున్నారు.  ఈ చిత్రానికి టైటిల్ ఈ రోజు (నవంబర్ 27) ఖరారు చేయనున్నారు. సంక్రాంతి కానుకగా  ఈ చిత్రం విడుదల కానుంది.