ఎన్టీఆర్‌కు పవన్ క్లాప్ - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్టీఆర్‌కు పవన్ క్లాప్

October 23, 2017

‘జై లవకుశ’ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్ హాజరై ఆశ్చర్యపరిచారు. పవన్ – త్రివిక్రమ్‌లు తొలుత నంచీ మంచి స్నేహితులు అవటం వల్ల పవన్ ఈ సినిమా ముహూర్తానికి హాజరయ్యారు. రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమానికి పవన్ విచ్చేసి మాట్లాడారు.

ఎన్టీఆర్ ఎదరు వెళ్ళి పవన్‌కు ఘనంగా స్వాగతం పలికాడు. పూజా కార్యక్రమం అనంతరం ఎన్టీఆర్ డైలాగ్‌కు పవన్ క్లాప్ కొట్టారు. డిసెంబరు నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఇతర టెక్నీషియన్ల వివరాలు వెళ్ళడిస్తామన్నారు చిత్ర యూనిట్.