శ్రీరెడ్డి వాహనాన్ని వెంబడించిన పవన్ అభిమానులు - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీరెడ్డి వాహనాన్ని వెంబడించిన పవన్ అభిమానులు

April 19, 2018

సంచలన తార శ్రీరెడ్డిని పవన్ అభిమానులు టార్గెట్ చేశారు. ఆమెను ట్రోల్ చేస్తూ నానా బూతులు తిడుతూ వీడియోలు అప్‌లోడ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ అభిమానులు మరో అడుగు ముందుకు వేశారు.

జూబ్లీహిల్స్‌లోని ఓ టీవీ ఛానెల్‌లో మంగళవారం రాత్రి చర్చావేదికలో పాల్గొనేందుకు శ్రీరెడ్డి వచ్చిన విషయం తెలుసుకొన్న పవన్ అభిమానులు పెద్దసంఖ్యలో అక్కడికి వచ్చారు. శ్రీరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమం అయిపోయాక ఆమె ఇంటికి వెళుతుండగా ఆమె వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆమె వాహనాన్ని వెంబడించారు.

జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌, ఎస్సై సైదా తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న వారిని నియంత్రించి, అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఆమెని నేరుగా జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి ఠాణాలో కాసేపు కూర్చోబెట్టారు. తర్వాత పోలీసు వాహనంలో హుమాయున్‌నగర్‌ ఠాణా పరిధిలోని ఆమె ఇంటికి తీసుకెళ్లి వదిలిపెట్టారు. ఈ ఘాతుకానికి పాల్పడ్డ కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకొని వదిలిపెట్టడం గమనార్హం.