పంతం నెగ్గించుకున్న పవన్ ఫ్యాన్స్.. మహేష్ కత్తి ట్విటర్ అకౌంట్ క్లోజ్ - MicTv.in - Telugu News
mictv telugu

పంతం నెగ్గించుకున్న పవన్ ఫ్యాన్స్.. మహేష్ కత్తి ట్విటర్ అకౌంట్ క్లోజ్

April 24, 2018

పంతం పట్టిన పవన్ కల్యాణ్ అభిమానులు మహేష్ కత్తిపై  పగ తీర్చుకున్నారు. మహేష్ కత్తి వాడుతున్న ట్విటర్ హ్యాండిల్‌ను మూయించి వేశారు. మహేష్ కత్తి ట్విటర్ అకౌంట్‌పై వేలాదిమంది పవన్ అభిమానులు ఫిర్యాదు చేయడంతో బ్లాక్ చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా కత్తి మహేష్ తన ఫేస్‌బుక్  అకౌంట్‌లో ప్రకటించారు. ఇకపై తాను ఫేస్‌బుక్ ద్వారానే స్పందిస్తానని అన్నారు.

‘పవన్ కల్యాణ్, కొన్ని లక్షలమంది ఫ్యాన్స్ కలిసి  నా ట్విటర్ అకౌంట్‌ను మూయించి వేశారు. ఈ ట్వీటమరాయుడు ట్వీట్ చేస్తే రెస్పాండ్ అయితే సమాధానం చెప్పుకోలేక సిగ్గుతో తల దించుకునే పరిస్థితి కల్పించారు. ఏం ట్వీటమ రాయుడో.. ఏం కాటమరాయుడో.. ఏం గిబ్బర్ సింగో నాకు అర్థం కావటంలేదు గానీ.. ఇంత భయం అయితే ఎలా పనన్ ? నీ అభిప్రాయానికి వ్యతిరుకంగా భావ వ్యక్తీకరణ చేస్తే నీ ఫ్యాన్స్, నువ్వు ఎదురుకోలేక ఈ పని చేశారు. ఛీ అనిపిస్తోంది.. అంతకు మించి చెప్పలేకపోతున్నా. నాకు ట్విటర్ లేకపోయినా, ఫేస్‌బుక్ లేకపోయినా నా మాటలు ఆగవు. నీకు నామీద అంత పగ ఎందుకో అర్థం కావటం లేదు. నా నోరు మూత పడదు క్యారియాన్.. ’  అంటూ వీడియోలో పేర్కొన్నారు కత్తి మహేష్.