ఉమ్మడి ఆస్తులను సమానంగా పంచాలి.. పవన్ జేఎఫ్‌సీ - MicTv.in - Telugu News
mictv telugu

ఉమ్మడి ఆస్తులను సమానంగా పంచాలి.. పవన్ జేఎఫ్‌సీ

March 3, 2018

నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ(జేఎఫ్‌సీ) నివేదిక బయటికొచ్చింది. ఆవాసా హోటల్ లో 5 గంటలకు పైగా జరుగుతోన్న సమావేశంలో  పలు నిర్ణయాలు తీసుకున్నారు. ‘ ఏపీ ప్రత్యేక డిమాండ్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు ‘కేంద్రం.. 10 షెడ్యూల్ లోని  ఉమ్మడి ఆస్తులను సమానంగా పంచాలి. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది కోసం రూ.20 వేల కోట్లు ఇవ్వాలి. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలి. కేంద్రం ప్రకటించిన వివిధ సంస్థల నిర్మాణం వేగ వంతం చేసి ఐదేళ్లతో పూర్తి చేయాలి’ అని తాజా నివేదికలో పేర్కొన్నారు.

మరి కొద్ది సమయంలో విభజన చట్టంలోని పలు హామీల అమలుకు సంబంధించిన పలు విషయాలపై   పవన్ జేఎఫ్‌సీ తుది నివేదికను విడుదల చేయనుంది. ఈ నివేదికను స్వయాన జనసేన అధినేత ప్రజలకు వివరిస్తారట. ఈ సమావేశంలోపవన్ తో పాటు జేపీ, ఉండవల్లి, తోట చంద్రశేఖర్‌, పద్మనాభయ్య, ఐవైఆర్‌ కృష్ణారావు హాజరైనారు.