పవన్ కళ్యాణ్ రష్యా అత్త ఆరోగ్యంగానే ఉంది! - MicTv.in - Telugu News
mictv telugu

పవన్ కళ్యాణ్ రష్యా అత్త ఆరోగ్యంగానే ఉంది!

March 7, 2018

జనసేన అధినేత పవన్ కళ్యాణ్  సోషల్ మీడియాపై మండిపడ్డారు.  ఆరోగ్యంగా ఉన్న మా అత్తను చంపేస్తారా? అంటూ పుకార్లను ఖండించారు.  పవన్ కళ్యాణ్ అత్త అంటే అత్తారింటి దారేది సినిమాలో అత్త అనుకునేరు..పవన్ మూడో భార్య అన్నా లెజినోవా వాళ్ల అమ్మ.  

ఆమె చనిపోయిందని అందుకే పవన్ తన కార్యకలాపాలన్నింటిని పక్కన పెట్టి భార్యను ఓదార్చుతూ ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో షేర్ల మీద షేర్లు అయ్యాయి. ఈ వార్తల్ని చూసి ఖంగుతున్న పవన్ ఈ పుకార్లను నమ్మొద్దు అని తన ప్రతినిధితో చెప్పించారు. ఈ ఒక్క వార్తే కాదు పవన్ మరియు అన్నా లెజినోవాకు పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ కూడా సానుభూతి తెలిపినట్టు పోస్టులు పుట్టుకొచ్చాయి. ఇలాంటి తప్పుడు కథనాలను ప్రచారం చేయొద్దని పవన్ కోరారు.