ఎన్నికలకు ముందు ఒక్క సినిమా.. పవన్ యూటర్న్! - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్నికలకు ముందు ఒక్క సినిమా.. పవన్ యూటర్న్!

November 19, 2018

అటు సినిమాలు – ఇటు రాజకీయాలు.. పవన్ కల్యణ్ విషయంలో ఈమాట నిజమయ్యేటట్టే వుంది. ఇన్ని రోజులూ ఆయన జనసేన పార్టీ పెట్టి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చారు. ఇక సినిమాలకు గుడ్ బై చెప్పినట్టేనని అనుకున్నారు. కానీ పవన్ అందరినీ షాక్‌కు గురిచేస్తూ సినిమా చెయ్యటానికి సిద్ధమయ్యారు. తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. కానీ పవన్ తన నిర్ణయాన్ని మార్చుకుని తన దృష్టిని పూర్తిగా 2019 ఏపీ ఎన్నికలపైనే పెట్టారు. ఈ క్రమంలో ఎన్నికలకు ఇంకా టైముంది కాబట్టి క్లాప్ కొట్టేయ్యాలని ఫిక్స్ అయినట్టున్నాడు పవన్. అందుకే సినిమాకు కాలుదువ్వారు.Telugu news Pawan kalyan act for the film … ... fest to the fan …ఇంతవరకు చేసిన సినిమాలు ఒకెత్తు అయితే ఇప్పుడు చేసే సినిమా ఒకెత్తు అవుతుంది పవన్ విషయంలో. అందుకే రాజకీయ నేపథ్యంగల పవర్ ఫుల్ సబ్జెక్టునే ఎంచుకున్నారట. ఓ కుర్ర హీరో ఇందులో నటిస్తున్నాడని సమాచారం. గతంలో నేల టికెట్టు, చుట్టాలబ్బాయి లాంటి సినిమాలను నిర్మించిన రామ్ తాళ్లూరి నిర్మాణంలో మూవీ చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమా కోసం సుమారు నెలన్నర పాటు డేట్లు కేటాయించడానికి పవన్ రెడీ అయ్యారు. అందుకు తగ్గట్టు పూర్తి డేట్స్ కూడా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికలకు ముందే సినిమాని విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే సినిమాకి సంబంధించిన ఫుల్ అప్ డేట్స్ బయటకు రానున్నాయి. ఈ సినిమా కోసం ఇద్దరు టాప్ డైరెక్టర్ల పేర్లు పరిశీలిస్తున్నారట చిత్ర యూనిట్. అన్నీ కుదిరితే త్వరలోనే పవన్ ఫ్యాన్స్ కోరిక మేరకు సినిమా తీసి వారి కోరిక తీరుస్తారు.