2014లో తప్పు చేశా! - MicTv.in - Telugu News
mictv telugu

2014లో తప్పు చేశా!

February 7, 2018

కేంద్రం వైఖరిపై అసహనం వ్యక్తం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ‘అందరికి న్యాయం చేసేందుకే నేను జనసేన పెట్టాను. విభజన అంశంలో ఏమి చర్చకు రాలేదు. కేంద్రం విభజన హామిలో వెనక్కి పోయారు. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరు అని నేను ప్రశ్నించినందుకే ప్యాకేజీ ఇచ్చారు. బీజెపీ మాటలతో మభ్య పెడుతుంది.

ఏపీ ఎంపీలు పార్లమెంట్‌లో ప్లే కార్డ్స్ పట్టుకొని నిరసన తెలిపితే లాభం ఉండదు. జనసేన తో పాటు ఒక జాయింట్ యాక్షన్ కమిటిగా అందరిని  కలుపుకొని పోతాము. ఉండవల్లి, జయప్రకాష్ నారాయణ లాంటి ప్రతిభావంతుల్ని కలుపుకుంట. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిలో లోపాలు ఉన్నాయి. 2014 ఎన్నికలో పోటీ చేసుంటే బాగుండేది, మా పార్టీ గొంతు వినిపించే అవకాశం వుండేది.

రేపు జరగబోయే వామపక్షాల బంద్‌కి జనసేన మద్దతు ఇస్తుంది. కొని పరిస్థితుల్లో నాకు తెలంగాణ ఉద్యమమే స్ఫూర్తి. అదే స్ఫూర్తిని ఏపీలో చూపియాలంటే చాలా కష్టం. ప్రజల పక్షాన ఉండే అందరిని కలుపుకొని పోతాను. విభజన హామీలపై  కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు. నేను ఇప్పుడే పార్టీ మొదలు పెట్టాను.  ఉన్న పార్టీలతో సమానంగా వెళ్లాలంటే సమయం పడుతుంది. జాయింట్ యాక్షన్ కమిటీతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటం చేస్తాము. జేఏసీ గురించి మాట్లాడతా టీడీపీ, బీజీపీ తో దోస్తీ కట్‌పై భవిష్యత్’లో నిర్ణయం తీసుకుంటా. కేంద్ర వైఖరిపై నాకు అశాంతి,అసహనం ఉంది’ అని పవన్ అన్నారు.