అత్తారింటికెళ్లిన  సమంతకు పవన్ గిఫ్ట్..!

ఎట్టకేలకు సమంత అక్కినేని  ఇంటి కోడలు అయిన విషయం తెలిసిందే.  గోవాలో  కొద్దిమంది అథితుల మధ్య నాగ చైతన్య, సమంత వివాహం జరిగింది. అయితే  మాంత్రికుడు తివిక్రమ్‌తో చేస్తున్న సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండడంవలన  పవన్ కళ్యాన్  సమంత పెళ్లికి  వెళ్లలేకపోయాడు. అక్కినేని కొత్త జంటకు  పవన్, త్రివిక్రమ్ ఇద్దరు కలిసి వాళ్ల మ్యారేజ్ గిఫ్ట్ గా  రెండు డైమండ్ రింగ్స్‌ను  స్పెషల్‌గా తయారు చేయించి  గోవాలో  ఉన్న  పెళ్లి జంటకు పంపారట.   త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్, సమంత కాంబినేషన్‌లో  ‘అత్తారింటికి దారేది’ సినిమా సూపర్ హిట్టయ్యింది. ఆతర్వాత త్రివిక్రమ్ తీసిన అఆ సినిమాలో కూడా సమంత నటన అందరినీ ఆకట్టుకుంది.