జనంలోకి జనసేన - MicTv.in - Telugu News
mictv telugu

జనంలోకి జనసేన

December 5, 2017

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం నుంచి జనంలోకి వెళ్లనున్నట్లు ప్రకటించారు. ఇటీవలే ఓ అవార్డును అందుకోవడానికి ఇంగ్లండ్ వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడి విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు జవాబును వెతికేందుకే తాను జనంలోకి వెళుతున్నట్లు చెప్పారు.

‘ ఇంగ్లండ్‌లో విద్యార్థుల‌తో జ‌రిగిన స‌మావేశంలో ఒక విద్యార్థి న‌న్ను ఓ విష‌యంపై ప్రశ్నించాడు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాన‌దిలో జ‌రిగిన ప‌డ‌వ ప్రమాదాన్ని ప్రస్తావించాడు. తెలుగుదేశం ప్రభుత్వం నిర్లక్ష్యం కార‌ణంగా 21 మంది ప్రాణాలు కోల్పోయారని అన్నాడు. టీడీపీకి మ‌ద్దతుగా ఎన్నిక‌ల స‌మ‌యంలో మీరు ప్రచారం చేసినందుకు మీరు కూడా బాధ్యులు కాదా?’ అని నన్ను ప్రశ్నించాడు.

ఆ యువ‌కుడు అడిగిన ప్రశ్న నన్ను ప్రశ్నించుకునేలా చేసింది.  కృష్ణాన‌ది ప‌డ‌వ ప్రమాద‌మే కాకుండా కేంద్ర ప్రభుత్వం విశాఖ‌పట్నంలోని డ్రెడ్జింగ్ కార్పొరేష‌న్ ప్రైవేటీక‌ర‌ణ కార‌ణంగా ఆ సంస్థ ఉద్యోగి వెంక‌టేష్ ఆత్మహ‌త్య ఉదంతంలోనూ నా వంతు బాధ్యత ఉంద‌ని అంగీక‌రిస్తున్నా. అందుకే రేపటినుండి నాలుగు రోజులపాటు జనంలోకి వెళుతున్నట్లు’ పవన్ స్పష్టం చేశాడు.