పవన్ కల్యాణ్ అంటే ఎవరో తెలియదన్న బాలయ్య - MicTv.in - Telugu News
mictv telugu

పవన్ కల్యాణ్ అంటే ఎవరో తెలియదన్న బాలయ్య

February 15, 2018

‘నందమూరి నటసింహానికి పవర్‌స్టార్ అంటే ఎవరో  తెలీదట… ఇది చాలా విడ్డూరం కదూ.. వెళ్ళి మీ బావను అడుగు తెలుస్తుంది ’ అంటూ సోషల్ మీడియాలో పవర్‌స్టార్ ఫ్యాన్స్ బాలకృష్ణపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమి తరఫున ప్రచారం చేసిన పవన్ కల్యాణ్ ఎవరో తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణకు తెలీదని బాలయ్య చెప్పటం చర్చనీయాంశంగా మారింది. ఏపీ ప్రత్యేక హోదా కోసం పవన్ పోరాటంపై మీ స్పందన ఏంటని వైజాగ్‌లో విలేకరులు ప్రశ్నించగా.. పవన్ కళ్యాణా.. తను ఎవరో నాకు తెలీదంటూ ఘాటుగా బదులిచ్చి, వెంటనే అక్కడి నుంచి కార్లో వెళ్లిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పవన్ కల్యాణ్ తనకు తెలియదని బాలకృష్ణ చెప్పడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గతంలో పవన్, బాలయ్య ఇద్దరూ కలిసి ఫొటోలు దిగారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణే కారణమని ఇటీవలే ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు.