శ్రీరెడ్డీ.. కోర్టుకెళ్లు, రచ్చ చేయకు.. పవన్ కల్యాణ్ సలహా - MicTv.in - Telugu News
mictv telugu

శ్రీరెడ్డీ.. కోర్టుకెళ్లు, రచ్చ చేయకు.. పవన్ కల్యాణ్ సలహా

April 14, 2018

టాలీవుడ్‌లో మహిళలపై జరుగుతున్న లైంగిక వేదింపులపై నటి శ్రీరెడ్డి చేస్తున్న పోరాటంపై ఎట్టకేలకు సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. న్యాయం కోసం కోర్టుకు వెళ్లాలని రచ్చ చేయకూడదని అన్నారు. సినీ పరిశ్రమలో ఎవరికైనా అన్యాయం జరిగితే  నేరుగా పోలీసు స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేయాలని, లేకపోతే కోర్టుకు వెళ్లాలని సూచించారు. అప్పుడే వారికి న్యాయం జరుగుతుందని పవన్ తెలిపారు.‘అన్యాయానికి గురైనవారికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుంది. టీవీ చానళ్ల చర్చల్లో పాల్గొనడం వల్ల ఏమీ ఒరగదు. కొన్ని రోజుల తర్వాత  ప్రజలు మరిచి పోతారు. అన్యాయం జరిగిన వారికి న్యాయం కూడా జరిగే అవకాశం ఉండకపోవచ్చు. టీవీల్లో కనిపించాలని కోరికతో కాకుండా, న్యాయం కోసం పోరాటం చేయాలి‘ అని ఆయన సూచించారు. చిరంజీవిని అడ్డుకుపెట్టుకుని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వాకాడ అప్పారావు అమ్మాయిలను వాడుకుంటాన్నడని శ్రీరెడ్డి ఆరోపించడం తెలిసిందే. దీంతో పవన్ కల్యాణ్ స్పందించారు.