తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తరుణంలోపవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జనసేన పార్టీ తెలంగాణలో కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేస్తుందని, ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉంటుందని సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.
పార్లమెంట్ ఎన్నికలలో జనసేన పోటీ – #JanaSena Chief @PawanKalyan pic.twitter.com/DGdGEid2FB
— JanaSena Party (@JanaSenaParty) November 19, 2018
ఇందుకు గల కారణాలను కూడా వివరించింది. తెలంగాణలో ఎన్నికలు సాధారణంగా మే నెలలో జరుగుతాయని అనుకున్నామని, కాని ముందస్తు ఎన్నికలు జరుగుతాయని ఊహించలేదని తెలిపింది. ముందస్తు ఎన్నికలకు పార్టీ వర్గాలు సిద్ధంగా లేవని, అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో వరుస సభలతో బిజీగా ఉన్నారని వివరిచింది. సమయం సరిపోదు కనుక ఎన్నికలకు దూరంగా ఉంటున్నామని, అయినా జనసేన పార్టీ ఎప్పుడూ తెలంగాణ ప్రజల వెంట ఉంటుందని వెల్లడించింది.
Telugu News Pawan kalyan lead jana sena party stay away from telangana assembly elections