ఎవర్ని కొట్టడానికో..? బెల్ట్‌తో సహా బయలుదేరాడు - MicTv.in - Telugu News
mictv telugu

ఎవర్ని కొట్టడానికో..? బెల్ట్‌తో సహా బయలుదేరాడు

December 12, 2017

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్  కాంబినేషన్లో వస్తున్న ‘అజ్ఞాతవాసి’ సినిమాలోని ఇంకో పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేశింది. ఇందులో పవన్ సైకిలెక్కి, నోటితో బెల్ట్ పట్టుకుని ఎవర్నో కొట్టడానికి బయలుదేరాడు. అన్నట్టు ఈ పోస్టర్ పై మరో విశేషం ఉంది.

డిసెంబర్ 16వ తేదీన ఈ చిత్ర టీజర్ ను విడుదల చేస్తున్నట్టు ఈ పోస్టర్‌లో తెలిపారు. 2018 సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈసినిమా విడుదల కానుంది. త్రివిక్రమ్,పవన్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. డిసెంబర్ 19న ఆడియో వేడుక హైదరాబాద్‌లో జరగనుంది.