నేను సియం అల్లుడిని కాను..ముఖ్యమంత్రి కొడుకును కాను - MicTv.in - Telugu News
mictv telugu

నేను సియం అల్లుడిని కాను..ముఖ్యమంత్రి కొడుకును కాను

March 14, 2018

గుంటూరు జిల్లాలో జరుగుతున్న  జనసేన ఆవిర్భావదినోత్సవ సభలో పవన్  అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు టీడీపీని  ఎండగట్టాడు.‘ మీకు పదవులు ఇచ్చింది ఎక్కి తొక్కించుకోవడానికా, ప్రత్యేక ప్యాకేజీ పేరిట చీకటి ఒప్పందాలు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సున్నితమైనవా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మాకు భయం లేదు. బీజేపీ, టీడీపీకి నేను ఎందుకు మద్దతిచ్చాను. 2019 ఎన్నికల్లో మీకు మద్దతు ఎందుకు ఇవ్వాలి? మీ అవినీతిని ప్రోత్సహించడానికే  మద్దతివ్వాలా? టీడీపీ నేతలు ఏపీని అవినీతి ఆంధ్ర చేశారు.లోకేష్ అవినీతికి అవధులు లేవు, మీపనులకు ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది. మీ అవినీతి చూసి ప్రజలు భయపడున్నారు’ అని పవన్ మండిపడ్డాడు. నేను సియం అల్లుడిని కాను ముఖ్యమంత్రి కొడుకును అంతకన్నా కాదు..ప్రజల కష్టాలు చూసి జనసేన పార్టీ పెట్టాను అని పవన్ అన్నారు.