తన కుటుంబంపై అత్యాచారం చేస్తున్నారు..పవన్ కళ్యాణ్ - MicTv.in - Telugu News
mictv telugu

తన కుటుంబంపై అత్యాచారం చేస్తున్నారు..పవన్ కళ్యాణ్

April 20, 2018

శ్రీరెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై ఎట్టకేలకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. తనకు సంబంధంలేని వ్యవహరంలోకి లాగేసి,తనపై,తన కుటుంబంపై అత్యాచారం చేస్తున్నారని మండిపడ్డారు. జరిగిన ఘటనలకు ముఖ్య సూత్రధారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని ఆరోపించారు. నారా లోకేశ్ , టీడీపీకి చెందిన మీడియా తనపై కుట్రలు చేసిందని,అందుకోసం రూ. 10 కోట్లు ఇచ్చి మరీ తన తల్లిని తిట్టించారని పవన్ ఆరోపించారు.‘ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడానికి అండగా నిలబడ్డ నాకు చంద్రబాబు నాయుడు గొప్ప ప్రతిఫలం ఇచ్చారు. సచివాలయం వేదికగా లోకేశ్‌, అతని సన్నిహితుడు, అనుకూల టీవీ ఛానెల్స్‌తో కలిసి నా కుటుంబంపై ఆరు నెలలుగా నిరవధిక అత్యాచారం జరిపారు, జరిపిస్తున్నారు. ఈ సందర్భంగా నేను చెప్పదల్చుకుంది ఒకటే. కొడుకుగా కన్నతల్లిని కాపాడుకోలేనప్పుడు చావడమే నయం. ఈ రోజు నుంచి ఏ క్షణమైనా చావడానికి సిద్ధపడి ముందుకు వెళుతున్నాను’ అని పవన్‌  తన ట్వీటర్ ద్వారా తెలిపారు.

‘దిగువ మధ్యతరగతి నుంచి వచ్చి, భర్త, పిల్లలే ప్రపంచంగా జీవించి, ఎవరికీ అపకారం చేయని తన మాతృమూర్తిపై కొందరు వ్యక్తులతో దారుణంగా తిట్టించారని, అలా తిట్టడానికి రూ.10 కోట్లు ఇచ్చారని, దర్శకుడు వర్మ, ప్రముఖ ఛానల్‌ యజమాని, దాని నిర్వాహకుడు, నారా లోకేశ్‌, అతని స్నేహితులు కలిసి చేస్తున్న దారుణాలు చంద్రబాబుకు తెలియదంటే నమ్మాలా? అని పవన్‌ పేర్కొన్నారు.

హోదా కంటే ‘వ్యభిచారమే’ ముఖ్యమా?  అనుకూల మీడియా ద్వారా చంద్రబాబు చేస్తున్న కుట్రలను విమర్శించే క్రమంలో పవన్‌ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ‘ సీఎం చంద్రబాబు గారు ప్రత్యేక హోదా సాధన కంటే.. పచ్చ ఛానళ్లు చేస్తున్న వ్యభిచారానికి చట్టబద్ధత కల్పించడంపైనే మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టారు. అసలు మీ ఉద్దేశం ఏంటి?’ అని పవన్‌ నిలదీశారు.